నితిన్ హిట్ సాంగ్ కి “పెళ్లి సందD” నటి స్టెప్పులు!

నితిన్ హిట్ సాంగ్ కి “పెళ్లి సందD” నటి స్టెప్పులు!

Published on Aug 14, 2022 11:50 PM IST


నితిన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సాంగ్ రారా రెడ్డి ఐ యామ్ రెడీ అందరినీ షేక్ చేస్తోంది. నటుడి కల్ట్ హిట్ జయం నుండి రాను రాను అంటూనే చిన్నదో బిట్‌ తో ఈ సాంగ్ మరింత హిట్ అయ్యింది. చాలా మంది ఈ ప్రత్యేకమైన బిట్‌కి రీల్స్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లో పెళ్లి సందD నటి శ్రీలీల చేరింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక రీల్‌ను పోస్ట్ చేసింది, ఆమె పాటకు అద్దిరిపోయే స్టెప్పులు వేసింది. నటి ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. తనకు ఇష్టమైన చిన్ననాటి పాటకు డ్యాన్స్ చేయకుండా ఆపలేనని పోస్ట్ లో వెల్లడించడం జరిగింది. ఆ పాట ఇప్పటికీ మాస్‌లో పాపులర్‌. కొద్దిసేపటికే ఈ వీడియో వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్‌లతో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు