అద్దిరిపోయేలా “పెళ్లి సందD” టీజర్

Published on Sep 14, 2021 5:10 pm IST

రోషన్, శ్రీ లీలా హీరో హీరోయిన్ లుగా గౌరీ రోనంకీ దర్శకత్వం లో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు నిర్మిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదల అయి ఇప్పటికే విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు వశిష్ట పాత్ర లో నటిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా ఆకట్టుకొనే విధంగా ఉండనుంది అని తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :