“పెళ్ళి సందD” టీం రేపు ఎక్కడ సందడి చేయబోతుందో తెలుసా?

Published on Sep 21, 2021 10:56 pm IST


శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్‌గా గౌరీ రోనంకీ దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించిన చిత్రం “పెళ్లి సందD”. గతంలో శ్రీకాంత్‌తో ‘పెళ్లి సందడి’ చేసి భారీ విజయాన్ని అందుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.

అయితే రేపు ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకు పెళ్లి సందD టీం హైదరాబాద్ మియాపూర్‌లోని విజేత సూపర్ మార్కెట్‌లో సందడి చేయబోతుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :