పెళ్లి సందD ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్…సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా!

Published on Sep 21, 2021 1:17 am IST


రోషన్, శ్రీ లీలా హీరో హీరోయిన్ లుగా గౌరీ రోనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, వీడియో లు, ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ను సెప్టెంబర్ 22 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు చేయనున్నారు. శ్రీ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :