రికార్డు : యూఎస్‌లో 1 మిలియన్ కొట్టిన ‘పెళ్ళిచూపులు’!

రికార్డు : యూఎస్‌లో 1 మిలియన్ కొట్టిన ‘పెళ్ళిచూపులు’!

Published on Aug 20, 2016 11:09 PM IST

Pellichoopulu
తెలుగు సినీ పరిశ్రమలో ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడో వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యూఎస్‌లో నేటితో ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది.

తెలుగు సినిమాలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడమనేది కొద్ది సంవత్సరాలుగా ఓ బెంచ్‌మార్క్‌గా కొనసాగుతూ వస్తోంది. కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఈ 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడమనేది జరుగుతూ వస్తోంది. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ ఒక్కటే ఇప్పటివరకూ 1 మిలియన్ కొట్టిన మిడిల్ బడ్జెట్ సినిమా. ఇలాంటి పరిస్థితుల్లో కోటిన్నర లోపే బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పెళ్ళిచూపులు’, యూఎస్‌లో 1 మిలియన్ సాధించడమనేది తిరుగులేని రికార్డుగానే చెప్పుకోవచ్చు.

కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి సినిమా మంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు