‘పెళ్ళిచూపులు’ సాటిలైట్ రైట్స్ ఎంత పలికాయంటే..!

Pellichoopulu
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమా రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా రెండో వారం కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడి మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో వసూళ్ళు ఇప్పటికీ చాలా బాగా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం మొదట్నుంచీ భారీగా కనిపించగా, తాజాగా ప్రముఖ చానల్లలో ఒకటైన జెమినీ టీవీ ఈ హక్కులను సొంతం చేసుకుంది.

సుమారు 2.35 కోట్ల రూపాయలు వెచ్చించి జెమినీ టీవీ, పెళ్ళిచూపులు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈమధ్యకాలంలో వచ్చిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి సినిమా మంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.