ఆ సినిమాలు థియేటర్ల లోనే…క్లారిటీ ఇచ్చిన పెన్ స్టూడియోస్!

Published on Sep 8, 2021 5:02 pm IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ల లో కంటే కూడా ఓటిటి లో సినిమాలు ఎక్కువగా విడుదల అవుతూ ఉండటం మనం చూస్తున్నాం. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, మిగతా భాషల కి చెందిన కొన్ని సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి ద్వారా విడుదల అవుతున్నాయి. అయితే గంగుభాయ్ కథియావాడి, ఆర్ ఆర్ ఆర్, మరియు ఎటాక్ లాంటి సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి ద్వారా విడుదల కావు అంటూ తాజాగా పెన్ స్టూడియోస్ స్పష్టం చేయడం జరిగింది.

అందుకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఈ భారీ చిత్రాలు ఓటిటి విడుదల అవుతాయి అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ, తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలు అన్నీ కూడా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సిద్దం అవుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :