అదిరిపోయిన ‘సర్కారు వారి’ పెన్నీ మాస్ అండ్ స్టైలిష్ ట్రీట్.!

Published on Mar 20, 2022 4:11 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనింగ్ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి మాస్ అండ్ స్టైలిష్ నెంబర్ రెండో సాంగ్ “పెన్నీ” ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు.

అయితే ఈ సాంగ్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి. మొదట రిలీజ్ చేసిన ప్రోమోకి ఎన్నో రెట్లు మించి స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి. కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో సాంగ్ మేకింగ్ గాని విజువల్స్ గాని ముఖ్యంగా మహేష్ లుక్స్ కానీ అదిరిపోయాయి. ముఖ్యంగా సాంగ్ లో లిరిక్స్ చాలా ట్రెండీగా క్యాచీగా ఉన్నాయి.

అలాగే ఈ కంప్లీట్ సాంగ్ లో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ అయితే మరో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే థమన్ మరియు మహేష్ బాబు ల కాంబోకి ఉన్న సాలిడ్ మ్యాజిక్ ని ఈ సాంగ్ రిపీట్ చేసిందని చెప్పి తీరాలి. ఇక కంప్లీట్ విజువల్ గా థియేటర్స్ లో ఎలా ఉంటుందో చూడాలి.

పెన్నీ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :