పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ తన నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సరికొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా భోగి పండగపూట ఆయన తన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియేటివ్ వర్క్స్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొలాబొరేట్ అవుతున్నట్లు ప్రకటించారు.
తమ ద్వారా సరికొత్త కంటెంట్, ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉందని.. ఇకపై తమ ప్రయాణంలో కొత్తవారికి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఈ రెండు బ్యానర్ల కలయికతో టాలీవుడ్‌కు సరికొత్త బూస్ట్ రావడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమాలు వస్తాయా.. అవి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయా.. అనేది వేచి చూడాలి.
Marking the spirit of new beginnings on the auspicious occasion of Bhogi, and taking forward earlier discussions on upcoming projects, Sri @PawanKalyan met with @peoplemediafcy Producer Sri @vishwaprasadtg for further deliberations.#PawanKalyanCreativeWorks pic.twitter.com/GPQAAiQ6BN
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 14, 2026
