ఇంటర్వ్యూ : ఆర్పీ పట్నాయక్ – ‘బ్రోకర్’ సినిమా నచ్చని వాళ్ళు ఈ సినిమాకి రావొద్దు !

ఇంటర్వ్యూ : ఆర్పీ పట్నాయక్ – ‘బ్రోకర్’ సినిమా నచ్చని వాళ్ళు ఈ సినిమాకి రావొద్దు !

Published on Nov 1, 2016 1:29 PM IST

rp-patnayak
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తరువాత నటుడిగా ఆ తరువాత దర్శకుడిగా మారిన వ్యక్తి ఆర్పీ పట్నాయక్. దర్శకుడిగా గతంలో ‘అందమైన మనసులో, బ్రోకర్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ఈయన ప్రస్తుతం ‘మనలో ఒక్కడు’ అనే సినిమాతో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం….

ప్ర) ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ?

జ) ఈ సినిమా మెయిన్ గా మీడియాని టార్గెట్ చేసి తీసిన సినిమా. అంటే మీడియా చూపుతున్న ఈగో ని ఇందులో చూపిస్తాం. మీడియాలో జరిగే కరప్షన్, బ్లాక్ మెయిలింగ్ ను మించి ఈ ఈగో ప్రమాదకరంగా మారింది.

ప్ర) అంటే కేవలం జర్నలిస్టులని మాత్రమే టార్గెట్ చేశారా ?

జ) లేదు. జర్నలిస్టులకి మాత్రమే టార్గెట్ చేయలేదు. మొత్తం మన రాష్ట్రంలో ఉన్న మీడియా వ్యవస్థని టార్గెట్ చేశాను. ప్రస్తుతం మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది. దాని వలన ఒక కామన్ మ్యాన్ ఎలా ఇబ్బందిపడ్డాడు అనేది చెప్పాను.

ప్ర) సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా ?

జ) నా దృష్టిలో ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టే కథ చెప్పడమే పెద్ద కమర్షియల్ పాయింట్. దాన్నే ఫాలో అయ్యాను. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్టవుతుంది. ముఖ్యంగా ప్రతి జర్నలిస్టుకి నచ్చుతుంది.

ప్ర) మీడియాని టచ్ చేస్తున్నారు. ఇబ్బందులేవీ రావా ?

జ) ఖచ్చితంగా వస్తాయి. ఆ ఇబ్బందులు ఎలాంటివైనా సరే వాటిని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

ప్ర) రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశానన్నారు ? ఏమిటా సంఘటనలు ?

జ) రియల్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. కొన్నిరోజుల క్రితం వేణు మాధవ్ చనిపోయాడని చెప్పారు. అప్పుడు వేణు మాధవ్ బయటికొచ్చి నేను చనిపోకుండా చనిపోయానని ఎలా న్యూస్ వేస్తారు. వాళ్ళు చెప్పింది నిజం చేయడానికి ఒకవేళ నన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉంది. నాకు సెక్యూరిటీ కావాలి అన్నాడు. అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అలాగే ఎమ్ఎస్ నారాయణ చనిపోక ముందే చనిపోయాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని చాలా భాధపెట్టారు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.

ప్ర) అలాగైతే ఇందులో సొల్యూషన్ ఏమైనా చెప్పారా ?

జ) చెప్పాను. మీడియా ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు. ఎలా బిహేవ్ చేయాలి అనేది చెప్పాను. ప్రతి జర్నలిస్టుకి ఈ సొల్యూషన్ నచ్చుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా సరే చెప్పే వార్తలో నిజముండాలి. అదే నేను చెప్పాను.

ప్ర) మీ గత సినిమాలు ప్లాప్ అవడానికి కారణం ?

జ) నా గత సినిమాలో ప్రమోషన్ సరిగా లేదు. అందుకే సినిమాలు జనాల్లోకి వెళ్లలేకపోయాయి. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రమోషన్స్ బాగా చేస్తున్నాం.

ప్ర ) ఈ సినిమాలో మీరే నటించడానికి కారణం ?

జ) కథ రాసుకునేటప్పుడే నేనైతేనే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే వేరే హీరోలతో చేయిస్తే సామాన్యుడి పాత్రకి హీరోయిజం వచ్చేస్తుంది. అలా రాకూడదు. నేనైతే ఎలాంటి హీరోయిజం ఉండదు కాబట్టి చేశాను. నది కృష్ణమూర్తి అనే ఓ మామూలు లెక్చరర్ పాత్ర.

ప్ర) ఈ సినిమాకి జనాలకి నచ్చుతుందంటారా ?

జ) ఖచ్చితంగా నచ్చుతుంది. నా గత సినిమా బ్రోకర్ కూడా మంచి సబ్జెక్ట్. ఇది కూడా అలాంటిదే. ఒకవేళ బ్రోకర్ సినిమా నచ్చని వాళ్ళు ఈ సినిమాకి రావొద్దు.

ప్ర) ఫ్యూచర్లో వేరే సినిమాలకి సంగీతం చేస్తారా ?

జ) చేస్తాను. కానీ నేను సంగీతం చేయాలంటే ఆ కథ నాకు బాగా నచ్చేదై ఉండాలి. అలా నచ్చే సబ్జెక్ట్స్ వస్తే ఖచ్చితంగా వేరే సినిమాలు కూడా చేస్తాను.

ప్ర) ఇకపై కూడా డైరెక్టర్ గానే కొనసాగుతారా ?

జ) అవును.. నా దగ్గర ఇంకో రెండు మూడు కథలున్నాయి. పూర్తి స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే ఏదో ఒక సినిమా మొదలుపెడతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు