శాతకర్ణి ట్రైలర్ లాంచ్ కు పక్కా ప్లాన్ రెడీ !

15th, December 2016 - 07:51:23 PM

Gautamiputra-Satakarni
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకోగా రేపు పూర్తిస్థాయి థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ కు బాలయ్య టీమ్ పక్కా ప్లాన్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంది. ముందుగా బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ లు రేపు ఉదయం కరీంనగర్ లోని కోటి లింగాలు ఆలయంలో ఉదయం 11గంటలకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం కరీంనగర్ లోని తిరుమల 70 ఎమ్ఎమ్ థియేటర్లో 5 గంటల నుండి ట్రైలర్ విడుదల కార్యక్రమం మొదలవుతుంది.
ఈ వేడుకకు బాలయ్య, క్రిష్ లు హాజరవుతారు. తరువాత అనుకున్న ముహూర్తం ప్రకారం 5: 30లకు 2 నిముషాల 11 సెకన్ల ట్రైలర్ విడుదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్లలో 100 మంది ప్రత్యేక అతిధుల నడుమ ఈ లాంచ్ జరగనుంది. చూస్తుంటే ఈ వేడుకతో రేపు సాయంత్రం అంతా బాలయ్య హవా స్పష్టంగా కనిపించనుంది. 2017 సంక్రాతి బరిలోకి దిగనున్న ఈ చిత్రంలో శ్రియ శరన్ హీరోయిన్ గా నటించగా అలనాటి నటి హేమ మాలిని బాలయ్య తల్లి పాత్రలో చాలా ఏళ్ల తరువాత తెలుగు తెరపై మెరవనుంది.