రేపు రిలీజ్ కానున్న పెద్దన్న టీజర్!

Published on Oct 22, 2021 8:29 pm IST


రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రం తెలుగు లో కూడా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తెలుగు లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం తెలుగు లో పెద్దన్న గా విడుదల కానుంది. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్, సూరి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తెలుగు లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం టీజర్ ను రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :