పవన్ సినిమాలో సాయెషా సైగల్ ?

14th, December 2016 - 10:43:01 AM

Sayesha
‘అఖిల్’ చిత్రంలో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయెషా సైగల్ ఆ చిత్రం తరువాత మరో అవకాశం అందుకోలేదు. కాగా టాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ ని సాయెషా అందుకోబోతున్నట్లు వార్తలువస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సాయెషా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో పవన్ ఓ చిత్రం లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో సాయెషా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన చిత్ర టీం నుంచి రావలసి ఉంది. ఈ చిత్రం లో తెలుగు నటి రక్షిత పవన్ చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం లో అజిత్ నటించిన వేదలమ్ రీమేక్ గా రాబోతోంది. ఏ ఎమ్ రత్నం దీనికి నిర్మాత.