పేట లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 37.63కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సిస్ లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.

కాగా తాజాగా యూ ఏస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. యుఎస్ లో 177 లొకేషన్స్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు 1,971,131 డాలర్లు కలెక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Exit mobile version