ఫోటో మూమెంట్ : “పుష్ప” హార్డ్ వర్క్ తర్వాత సుకుమార్ హ్యాపీ ఫేస్.!

Published on Dec 16, 2021 1:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ల కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ చివరి నిమిషం వరకు కూడా ఒక నిరంతర యోధుడిలా రేయింబవళ్లు కష్టపడుతూ ఫైనల్ అవుట్ పుట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.

అయితే ముంబైలో సుకుమార్ ముంబైలో కొన్ని రోజులు పాటు అలా ఉండిపోవాల్సి వచ్చింది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా తాను హాజరు కాలేదు నిన్న మొన్న ప్రెస్ మీట్స్ కి కూడా సుకుమార్ వెళ్లకుండా అన్ని భాషల సౌండ్ మిక్స్ ని కంప్లీట్ చేసే బయటకి వచ్చారు. మరి ఈ పనులు తర్వాత తన టెక్నికల్ క్రూ తో తీసుకున్న ఒక సెల్ఫీ ఇపుడు బయటకి వచ్చింది.

ఇన్ని రోజులు బయట కనిపించని సుకుమార్ ఇందులో కాస్త రిలీఫ్ గా చిన్న ఆనందపు నవ్వుతో కనిపిస్తున్నారు. మరి ఈరోజు ప్రెస్ మీట్ లో తాను హాజరు కావచ్చని టాక్ వినిపిస్తుంది. మరి దాని వరకు వేచి చూడాలి. ఇక తాను రోజులో ఎన్నో గంటలు శ్రమించిన పుష్ప రేపు డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :