ఫోటో మూమెంట్ : అక్కినేని కజిన్స్ అంతా స్పెషల్ రీయూనియన్

ఫోటో మూమెంట్ : అక్కినేని కజిన్స్ అంతా స్పెషల్ రీయూనియన్

Published on May 12, 2024 2:00 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి లెజెండరీ లెగసి లలో అక్కినేని వారు కుటుంబం కూడా ఒకటి. మరి అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని ఇప్పుడు నాగార్జున, చైతన్య, అఖిల్ సహా సుమంత్, సుశాంత్ లు టాలీవుడ్ లో అదరగొడుతున్నారు. అయితే ఇప్పుడు ఒకోకరు తమ తమ ఆసక్తికర ప్రాజెక్ట్ లు చేస్తుండగా ఓ స్పెషల్ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇందులో ప్రత్యేకంగా అక్కినేని వారి యువ కజిన్స్ మాత్రమే కనిపిస్తూ ఉండడం విశేషం.

చైతన్య, అఖిల్ అలాగే సుమంత్, సుశాంత్ ఇంకా సుప్రియ తదితరులు ఒక రీయూనియన్ లా కలిశారు. దీనితో ఈ పిక్ మంచి స్పెషల్ గా మారి అక్కినేని అభిమానుల్లో ఆనందాన్ని రేపింది. ఇక మరో పక్క నాగ చైతన్య భారీ చిత్రం “తండేల్” లో బిజీగా ఉండగా నాగార్జున కూడా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే అఖిల్ కూడా ఏజెంట్ లాంటి డిజప్పాయింటింగ్ సినిమా వచ్చినా కూడా ఓ భారీ సినిమానే లైన్ లో పెట్టాడు. ఇవన్నీ రానున్న రోజుల్లో అక్కినేని ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇవ్వనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు