ఫోటో మూమెంట్: తెలంగాణ సీఎం తో బాలయ్య పవర్ఫుల్ స్నాప్ వైరల్

రీసెంట్ గానే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 60వ చిత్రం “సత్యభామ” ఈవెంట్ లో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే నెక్స్ట్ విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కోసం కూడా రానుండడం ఫిక్స్ అయ్యింది. ఇక ఈ రెండు వార్తల్లో మూడో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా బాలయ్య అలాగే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో బాలయ్య నడిపిస్తున్న బసవతారకం ఆసుపత్రికి రాగా బాలయ్య పుష్ప గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. మరి ఈ పిక్ లో ఇద్దరూ కూడా నవ్వుతూ కనిపించి వారి అభిమానుల కళ్ళలో ఆనందం నిలిపారు. దీంతో ఈ పవర్ఫుల్ స్నాప్ వైరల్ గా మారుతుంది. ఇక బాలయ్య ఈ పనులు అన్నీ చూసుకున్న తన అవైటెడ్ సినిమా NBK 109 లో జాయిన్ కానున్నారు.

Exit mobile version