ఫోటో మూమెంట్ : “NBK 107” డైరెక్టర్ ఫ్యామిలీతో బాలయ్య ఫ్యామిలీ..!

Published on Sep 29, 2022 8:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో ఇప్పుడు 107వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న మొదటి సినిమా కావడం పైగా ఇద్దరికీ కూడా భారీ హిట్స్ తమ గత సినిమాలతో అందుకోవడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ లో అయితే మేకర్స్ మంచి బిజీగా ఉండగా లేటెస్ట్ గా ఓ బ్యూటిఫుల్ ఫోటో అయితే బయటకి వచ్చింది.

సినిమా సెట్స్ నుంచే టర్కీ షూట్ అయ్యాక దర్శకుడు గోపీచంద్ తన భార్య కొడుకు అలాగే బాలయ్య తన సతీమణి సహా నందమూరి మోక్షజ్ఞ్య లు ఓ బోట్ వెకేషన్ లో కలిసి ఉన్నారు. దీనితో ఈ ఇరు కుటుంబాలు నుంచి వచ్చిన ఈ ఫోటో మంచి వైరల్ గా మారింది. ఇక బాలయ్య గోపీచంద్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :