ఫోటో మూమెంట్ : “అన్ స్టాప్పబుల్ 2” సెట్స్ లో బాలయ్య స్టిల్స్ వైరల్.!

Published on Oct 4, 2022 12:34 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పలు సినిమాలు చెయ్యడమే కాకుండా మరో పక్క తన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఓటిటి షో “అన్ స్టాప్పబుల్” తో ఓటిటి లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య అయితే ఇపుడు ఈ సాలిడ్ హిట్ షో కి రెండో సీజన్లో కూడా చురుగ్గా పాల్గొంటుండగా ఇప్పుడు ఈ సీజన్ 2 షూట్ సెట్స్ లో కొన్ని అదిరే స్టిల్స్ అయితే బయటకి వచ్చాయి.

మరి ఈ షో యూనిట్ తో బాలయ్య కలిసి తన సరికొత్త అవతార్ లో కనిపిస్తూ మంచి డైనమిక్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. దీనితో ఇప్పుడు తన ఈ లేటెస్ట్ స్టిల్స్ మంచి వైరల్ గా మారాయి. ఇక ఈ రోజు అయితే సాయంత్రం 6 గంటలకి గాను ఓ లాంచ్ ఈవెంట్ ని అయితే విజయవాడలో జరుపుతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇక ఈ సాలిడ్ షో కి అయితే చాలా మంది స్టార్స్ వస్తారని తెలుస్తుంది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :