‘పృథ్వీరాజ్’ తో రానా… వైరల్ అవుతున్న పిక్ !

Published on Dec 6, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి సినిమా ‘అయ్యప్పనుం కోషియుం’. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో రానా చేస్తున్న పాత్రను ఆల్ రెడీ పృధ్విరాజ్ మలయాళంలో చేశాడు. కాగా తాజాగా రానా – పృథ్వీరాజ్ కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా బ్రో డాడీ అనే చిత్రం రాబోతుంది. ఈ సినిమా సెట్స్ లోనే కోషి పాత్రధారి పృథ్వీరాజ్ ను, డేనియల్ శేఖర్ పాత్రధారి రానా కలుసుకొని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. తమ మధ్య జరిగిన సరదా సంభాషణ విషయాన్ని తెలియజేస్తూ పృథ్వీరాజ్ ఈ ఫోటోను తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో షేర్ చేశాడు.

ఇక పిక్ లో ‘పృథ్వీరాజ్ సుకుమారన్ తన బ్రో డాడీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అవుట్ ఫుట్ ను చూస్తుండగా.. అదే సమయంలో రానా కూడా ఆ అవుట్ ఫుట్ చూసి నవ్వుతూ సరదాగా ఏదో కామెంట్ చేసినట్టు ఉన్నాడు. దానికి పృథ్వీరాజ్ కూడా పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఇక గతంలో రానా బర్త్ డేకి విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్ లో రానా నటనను చూసి పృథ్వీరాజ్ అప్రిషియేట్ చేస్తూ మెసేజ్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :