ఫోటో మూమెంట్ : పవన్ తో సీరియస్ మ్యాటర్ డిస్కషన్ లో హరీష్ శంకర్.!

Published on Mar 2, 2022 6:30 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి తాను హీరోగా నటించిన చిత్రాల్లో తన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్” కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన ఈ చిత్రం 2012లో భారీ విజయాన్ని సొంతం చేసుకొని వారి కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్ గా నమోదు అయ్యింది.

మరి ఇదిలా ఉండగా మళ్ళీ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్న సమయంలో “భవదీయుడు భగత్ సింగ్” అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సెన్సేషన్ ని వీరు రేపారు. అయితే ఆల్రెడీ ఫస్ట్ లుక్ వరకు స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది. అయితే లేటెస్ట్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టడం జరిగింది.

దీనిలో పవన్ మరియు తాను కలిసి ఏదో మాట్లడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే మేము నిజంగానే ఓ అంశం కోసం మాట్లాడుకున్నామని ఈ ఫోటో కోసం గుర్తుంచుకోండి అందులో మేము ఏం డిస్కస్ చేసామో తర్వాత టైం చూసి వెల్లడి చేస్తానని హరీష్ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ మరింత ఆసక్తిగా మారిపోయింది. మరి తాను ఏం వెల్లడి చేస్తారో ఎప్పుడు చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :