ఫోటో మూమెంట్ : తన బాబుపై స్వీటెస్ట్ పిక్ షేర్ చేసిన కాజల్.!

Published on Jun 10, 2022 11:29 pm IST

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఏ కీచ్లు కూడా ఒకరు. అయితే కాజల్ ఈ ప్యాండమిక్ టైం లోనే తన లైఫ్ లో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసి ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యిపోయింది. అయితే ఈ మధ్యలో కూడా తనకు ఎదురైనా అనుభవాలు కొన్నిటిని కోసం షేర్ చేసుకుంది.

ఇక తన బాబు పుట్టాక ఓ తల్లిగా తన బాబే ప్రపంచంగా బ్రతుకుతున్న కాజల్ లేటెస్ట్ గా ఒక స్వీటెస్ట్ ఫోటోని షేర్ చేసుకుంది. తన బాబుని ఎత్తుకొని తన వేలిపై బాబు పాదం దానికి చిన్ని పట్టి లాంటిది వేసి చూపించింది. దానికి ది స్వీటెస్ట్ టైనీ థింగ్స్ అంటే చిన్ని వస్తువులు అంటూ పోస్ట్ చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీనితో ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఈ ఫోటో మరియు పోస్ట్ మంచి వైరల్ అవుతుండగా దీనిని చూసి ఆమె ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :