ఫోటో మూమెంట్ : ‘సర్కారు’ సెట్స్ లో కీర్తీ సురేష్ తో నమ్రత

ఫోటో మూమెంట్ : ‘సర్కారు’ సెట్స్ లో కీర్తీ సురేష్ తో నమ్రత

Published on Oct 26, 2021 9:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇప్పుడు స్పెయిన్ దేశంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా సాంగ్ షూట్ తో దీనిని ముగించారు.

మరి ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ కీర్తీ సురేష్ తో మహేష్ భార్య నమ్రత కలిసి మాట్లాడుతున్న పిక్ ఒకటి బయటకి వచ్చింది. ఇందులో వారు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జాయ్ గా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ కాస్తా వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు