ఫొటో మూమెంట్: బాలయ్య, వెంకీ మామతో కుష్బూ..

ఫొటో మూమెంట్: బాలయ్య, వెంకీ మామతో కుష్బూ..

Published on Jul 4, 2024 7:04 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి గ్యాప్ లో లేటెస్ట్ గా బాలయ్య తన సహచర నటి వెర్సటైల్ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి రిసెప్షన్ అయితే వెళ్లారు. మరి ఈ వేడుకలో అయితే మరింతమంది ముఖ్య నటులు కూడా హాజరు కాగా అక్కడ నుంచి సీనియర్ నటి కుష్బూ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ మంచి వైరల్ గా మారింది.

మరి ఇందులో తను వెంకీమామ అలాగే బాలయ్య లతో కలిసి తీసుకున్న పిక్స్ షేర్ చేసుకున్నారు. మరి ఇందులో అంతా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తూ అభిమానులకి మరింత ట్రీట్ ఇచ్చారు. ఇక వీరితో పాటుగా బాలయ్య లేటెస్ట్ కల్కి నటి శోభన కూడా కలిసి ఓ పిక్ దిగగా అది కూడా మంచి వైరల్ గా మారింది. ఇలా మొత్తానికి అయితే కుష్బూ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు