ఫోటో మూమెంట్ : కమల్ తో ఖుష్బూ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Jun 18, 2022 9:00 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్”. భారీ వసూళ్లను కొల్లగొడుతూ సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. మరి ఇప్పుడు కమల్ సహా చిత్ర యూనిట్ అంతా కూడా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ కమల్ తో కలిసి ఒక ఫోటో పెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

“నా హీరో.. నా ఫ్రెండ్… నా విక్రమ్” అంటూ కమల్ పై మూడు భావాలను ఒకేసారి వ్యక్తపరిచి సినిమా విజయానికి కంగ్రాట్స్ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది. మరి ఈ కాంబోలో ఆల్రెడీ “మైఖేల్ మదన కామరాజు” అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కమల్ ఒక పాత్ర సరసన ఖుష్బూ హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు అయితే ఈ పోస్ట్ మరియు ఫొటోస్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :