వైరల్ పిక్ : ట్రెడిషనల్ వేర్ లో అదరగొట్టిన సిద్దార్ధ, కియారా జోడీ

Published on Feb 22, 2023 3:01 am IST


ఫగ్లి మూవీ ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల నటి కియారా అద్వానీ, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఎమ్ ఎస్ ధోని మూవీ భారీ సక్సెస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను మూవీ చేసి పెద్ద సక్సెస్ అందుకున్న కియారా ప్రస్తుతం రామ్ చరణ్ తో RC 15 లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్ర ని ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్నారు కియారా.

వీరిద్దరి వివాహం రాజస్థాన్ లో పెద్దల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరుగగా, నేడు వీరిద్దరూ కలిసి ట్రెడిషినల్ దుస్తుల్లో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని ఫ్యాన్స్ , ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇందులో సిద్దార్థ బ్లాక్ కలర్ షేర్వాణీ ధరించగా, కియారా గోల్డ్ కలర్ లెహెంగా ధరించారు. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా నూతన దంపతులకు పలువురు ప్రేక్షకాభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :