మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. మరి కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క” అనే చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం హిట్ తర్వాత మరో సినిమా “దిల్ రూబా” అనే సినిమాతో రిలీజ్ కి రాబోతున్నాడు.
ఓ పక్క ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఓ గుడ్ న్యూస్ అయితే తాను షేర్ చేసాడు. తన భార్య రహస్య గోరక్ అబ్బవరంతో కలిసి ఓ బ్యూటిఫుల్ పిక్ తో తమ జీవితంలో కొత్త మెంబర్ ని ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. అయితే తన భార్య గర్భవతి అయినట్టుగా తన బేబీ బంప్ తో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో మంచి మూమెంట్ గా మారింది. దీనితో తమ పిక్ ఇపుడు వైరల్ గా మారింది. ఇక తన లేటెస్ట్ సినిమా దిల్ రూబా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కి రాబోతుంది.
Our love is growing by 2 feet ???????????? pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025