ఫోటో మూమెంట్: మహేష్ స్మార్ట్ లుక్స్.. ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు

mahesh-babu

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు భారీ చిత్రం వారణాసి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం మహేష్ క్రేజీ లుక్ ని కూడా సిద్ధం చేశారు. ఇలా రీసెంట్ గా వచ్చిన టైటిల్ గ్లింప్స్ పాన్ వరల్డ్ ఆడియెన్స్ ని అలరించింది. ఇక ఇదిలా ఉండగా సినిమా నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ తన ఫ్యామిలీతో హ్యాపీ టైం ని గడుపుతున్నారు.

ఇలా లేటెస్ట్ గా తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో తాను పాల్గొన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో తన కుటుంబం, ఫ్రెండ్స్ తో మహేష్ కనిపిస్తుండగా తాను మాత్రం మరింత స్మార్ట్ అండ్ యంగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. దీనితో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక త్వరలోనే మహేష్ వారణాసి సెట్స్ లో జాయిన్ కానున్నారు.

Exit mobile version