ఫోటో మూమెంట్ : బిల్ గేట్స్ తో మహేష్ బాబు..ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.!

Published on Jun 29, 2022 11:02 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “సర్కారు వారి పాట” భారీ హిట్ తో తాను తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ మధ్యలో ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ని తమ అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పంచుకున్న సెన్సేషనల్ స్నాప్ మాత్రం మంచి వైరల్ గా మారింది.

ఎందుకంటే ఈసారి మహేష్ ప్రపంచ అతి పెద్ద బిలినియర్స్ లో ఒకరైన దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో తాను మరియు తన భార్య కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు. మరి ఈ మీట్ పై మాట్లాడుతూ బిల్ గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. తాను ప్రపంచంలో గ్రేటెస్ట్ విజన్ కలిగిన వ్యక్తుల్లో తాను ఒకరు. నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అంటూ మహేష్ పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఫోటో ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :