ఫోటో మూమెంట్ : మరో మాస్ సాంగ్ షూట్ లో మాస్ మహారాజ్!

Published on Dec 30, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ ఆడియెన్స్ లో మోస్ట్ లవబుల్ మరియు మోస్ట్ ఎనర్జెటిక్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ డెఫినెట్ గా మొదట వరుసలో ఉంటారు. తన ఎనర్జీ కానీ మాస్ ప్రెజెన్స్ కానీ తనకే సొంతం. మరి అలానే తాను నటించిన లేటెస్ట్ సినిమా “క్రాక్” తో మాసివ్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ మళ్ళీ వెంటనే “ఖిలాడి” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని స్టార్ట్ చేసి త్వరగానే రిలీజ్ చేసేయాల్సి ఉంది.

కానీ ఊహించని విధంగా కరోనా రెండో వేవ్ స్టార్ట్ కావడంతో ఇప్పటికి ఆగింది. అయితే మరి ఇప్పుడు షూట్ లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో మరో మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నేరుగా సాంగ్ షూట్ నుంచే రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి అలాగే వారితో సాంగ్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూడా కనిపిస్తున్నారు.

మరి హీరో హీరోయిన్స్ డ్రెస్సింగ్ అంతా చూస్తుంటే సాంగ్ పక్కా నాటుగా మాసివ్ గా ఉంటుంది అని అర్ధం అవుతుంది. మరి దేవి ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో రవితేజ ఎలాంటి స్టెప్స్ వేసారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :