ఫోటో మూమెంట్ : ముంబైలో రాకీ భాయ్ కి మాసివ్ రెస్పాన్స్.!

Published on Apr 6, 2022 5:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” ఒకటి. అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఎంత క్రేజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి ఈ హైప్ ని మరింత చేస్తూ మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చెయ్యగా హీరో యష్ కూడా చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరి లేటెస్ట్ గా అయితే హిందీలో ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్ వెళ్లగా రాకీ భాయ్ యష్ రాకకి అక్కడ మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఒక మాల్ లో ప్రమోషన్స్ కి యష్ వెళ్లగా అక్కడి ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. దీనితో ఈ మాసివ్ రెస్పాన్స్ ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు షేర్ చేసి తెలియజేసారు.

సంబంధిత సమాచారం :