ఫోటో మూమెంట్ : ఒకే ఫ్రేమ్ లో మెగా, అల్లు యంగ్ గ్యాంగ్.!

ఫోటో మూమెంట్ : ఒకే ఫ్రేమ్ లో మెగా, అల్లు యంగ్ గ్యాంగ్.!

Published on Oct 24, 2022 8:00 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో పలు ఆసక్తికర సినిమాలు చేసి అలరిస్తున్న హీరోస్ లో మెగా హీరోలు కూడా ఉన్నారు. మరి మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు సిద్ధం చేస్తూ ఉండగా మెగా మరియు అల్లు కుటుంబం అయితే ఆఫ్ లైన్ లో ఎప్పుడూ కూడా తమ బాండింగ్ ఏ లెవెల్లో ఉందో చూపిస్తూ కొందరి కామెంట్స్ కి చెక్ పెడతారు. అల్లు మరియు మెగా ఫ్యామిలీ విషయంలో ఈ కామెంట్స్ అయితే ఎప్పుడూ వినిపిస్తునే ఉంటాయి.

మరి లేటెస్ట్ గా అయితే మెగా సహా అల్లు కుటుంబం యంగ్ గ్యాంగ్ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఓ ఫంక్షన్ లో వీరు అంతా మీట్ కాగా మరి ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అలాగే మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ సహా వారి కుటుంబ సోదర సోదరీమణులు నీహారిక, శ్రీజ లతో కలిసి కనిపించారు. మరి ఈ పోస్ట్ ని అయితే మెగా డాటర్ శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోగా మెగా ఫ్యాన్స్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CkEVAoKy2wP/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు