ఫోటో మూమెంట్ : యూనియన్ మినిస్టర్ తో మెగాస్టార్, కింగ్ నాగ్.!

Published on Feb 27, 2023 12:00 pm IST

ప్రస్తుతం మన టాలీవడో సీనియర్ స్టార్ హీరో లు మెగాస్టార్ చిరంజీవి అలాగే కింగ్ నాగార్జున సహా బాలయ్య మరియు వెంకీ మామ లు తమదైన మార్క్ లో మంచి సినిమాలు చేస్తూ మరోసారి మంచి బ్యాక్ లు వరుసగా అందుకున్నారు. అలాగే ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా లేటెస్ట్ గా అయితే మెగాస్టార్ కింగ్ నాగ్ తో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ స్నాప్ ని అయితే షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.

జెనరల్ గా ఇండస్ట్రీ లో చిరు మరియు నాగ్ లు ఎంతో సన్నిహితంగా ఉంటారని చాలామందికి తెలిసిందే. అలాగే లేటెస్ట్ గా దేశ యూనియన్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ని నిన్న చిరు నివాసం వద్ద కలిసినట్టుగా తెలిపారు. మరి ఈ మీట్ లో చిరు మరియు నాగ్ లు ఈ యంగ్ మినిష్టర్ కి శాలువా కప్పి ఆప్యాయంగా ఆహ్వానించగా ఇండియన్ సినిమా సహా ఇతర కొన్ని అంశాలపై కలిసి నా బ్రదర్ నాగార్జున తో కలిసి మాట్లాడడం ఆనందంగా ఉందని చిరు తెలిపారు. దీనితో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :