ఫోటో మూమెంట్: తలైవర్ తో మోహన్ బాబు లవ్లీ పిక్ వైరల్

ఫోటో మూమెంట్: తలైవర్ తో మోహన్ బాబు లవ్లీ పిక్ వైరల్

Published on Jul 5, 2024 3:00 PM IST


కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు టీజీ జ్ఞ్యానవేల్ తో “వేట్టైయాన్” అలాగే యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సాలిడ్ ప్రాజెక్ట్ “కూలీ” సినిమాలు చేస్తున్నారు.

మరి ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొనగా వీటిలో పలు రూమర్స్ కి చెక్ పెడుతూ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాపై అప్డేట్స్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ సినిమా షూట్ కోసం రజినీకాంత్ హైదరాబాద్ కి కూడా వచ్చారు. మరి ఈ క్రమంలో డైలాగ్ యంగ్ మోహన్ బాబుని రజిని కలవడం హైలైట్ గా మారింది.

ఇద్దరు కూడా ఫ్లైట్ లో కలిసి కనిపించడం పైగా రజినీకాంత్ మోహన్ బాబు భుజం పై చెయ్యి వేసి మరో చేత్తో మోహన్ బాబు గడ్డం పట్టుకొని ఎంతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. దీనితో వీరి నడుమ బాండింగ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇప్పుడు ఈ లవ్లీ పిక్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు