ఫోటో మూమెంట్ : టామ్ క్రూయిజ్ తో ‘నాటు’ రచయిత.!

ఫోటో మూమెంట్ : టామ్ క్రూయిజ్ తో ‘నాటు’ రచయిత.!

Published on Feb 15, 2023 8:00 AM IST

ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా కూడా మన తెలుగు సినిమా “రౌద్రం రణం రుధిరం” విజయం అంతకంతకూ వ్యాప్తి చెందుతుంది. మరి ఈ సినిమాలో సెన్సేషనల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యినటువంటి నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ కాగా ఈ పాట కి ఆద్యం పోసిన సాహిత్య రచయిత మరియు పాటకి సాలిడ్ బీట్ తో ప్రాణం పోసిన సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి కి అకాడమీ నుంచి ప్రత్యేక అభినందనలు ఆహ్వానాలు అందుతున్నాయి.

మరి తాజాగా అకాడమీ గ్రేట్ లంచ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ స్నాప్ బయటకొచ్చి వైరల్ కాగా తాజాగా చంద్రబోస్ అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ని షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ లో యాక్షన్ కి పెట్టింది పేరు అయినటువంటి దిగ్గజ స్టార్ హీరో తాం క్రూయిజ్ తో అయితే చంద్రబోస్ కలిసినట్టుగా ఓ సూపర్ పిక్ ని షేర్ చేసుకున్నారు. “విత్ టాప్ గన్ టామ్” అంటూ షేర్ చేసిన ఈ పిక్ లో బోస్ గారి కంటే టామ్ ముఖంలో ఆనందమే ఎక్కువని చూడొచ్చు. దీనితో ఈ పిక్ అమితంగా వైరల్ గా మారింది. ఇక ఈసారి అకాడమీ అవార్డ్స్ లో టామ్ క్రూయిజ్ నటించిన “టాప్ గన్ మావెరిక్” కూడా పలు విభాగాల్లో ఎంపిక అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు