ఫోటో మొమెంట్ : అమల బర్త్ డే సెలబ్రేషన్స్ లో నాగ్, అఖిల్

Published on Sep 12, 2023 5:30 pm IST

టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమల అక్కినేని కూడా టాలీవుడ్ లో గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందం, అభినయంతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల అక్కడక్కడా సినిమాల్లో మంచి గుర్తింపు కలిగిన పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకెళ్తున్నారు అమల.

అయితే విషయం ఏమిటంటే, నేడు అమల పుట్టిన రోజు సెలబ్రేషన్స్ సందర్భంగా తన తల్లితో పాటు నాగ్, అఖిల్ కలిసి దిగిన ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు అమల. పుట్టినరోజులు చాలా ప్రత్యేకమైనవి, ఎందుకంటే అన్ని ప్రాంతాల నుండి ప్రేమ వర్షం కురుస్తుంది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ అమల పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :