ఫోటో మూమెంట్ : తిరుమల సన్నిధిలో నయనతార మరియు విగ్నేష్.!

Published on Apr 28, 2022 10:52 am IST


తాజాగా అటు తమిళ్ మరియు మన తెలుగులో రిలీజ్ కి వచ్చిన కొత్త చిత్రం “కతువాకుల రెండు కాదల్”. కోలీవుడ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా స్టార్ హీరోయిన్లు నయనతార మరియు సమంతా లు అతడికి జంటగా దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో కన్మని రాంబో కతిజ అనే టైటిల్ తో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది.

అయితే రిలీజ్ కి ముందు మంచి ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటు వస్తున్న ఈ సినిమా విడుదల ఈరోజు కాగా తమ సినిమా విజయం కోసం హీరోయిన్ నయనతార మరియు తన బాయ్ ఫ్రెండ్ ఈ సినిమా దర్శకుడు అయినటువంటి విగ్నేష్ లు కలిసి ఈరోజు తెల్లవారు జామున తిరుమల సన్నిధానం కి చేరుకొన్నారు.

అందులో భాగంగా ఒక ఫోటో ని కూడా అక్కడ నుంచి తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో అది కాస్తా ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందివ్వగా 7 స్క్రీన్ స్టూడియో వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :