ఫోటో మూమెంట్ : తన భార్యతో బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఎన్టీఆర్.!

ఫోటో మూమెంట్ : తన భార్యతో బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఎన్టీఆర్.!

Published on Dec 17, 2022 10:01 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాన్ వరల్డ్ రీచ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల సినిమాలో జాయిన్ కావాల్సి ఉండగా ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు అయితే తారక్ తన ఫ్యామిలీతో విహార యాత్రకి రీసెంట్ గా పయనం అయ్యాడు. మరి తన భార్య పిల్లలతో కలిసి వెళ్లిన తారక్ లేటెస్ట్ గా ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.

మరి తన భార్య ప్రణతి పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె నుదిటి పై ముద్దు పెడుతూ ఆలింగనం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు. దీనికి గాను పోస్ట్ కొన్ని లవ్ సింబల్స్ కూడా పెట్టి తన లవ్ అన్నట్టుగా తారక్ పోస్ట్ చేయడం అభిమానుల్లో ఆనందం నింపింది. దీనితో ఇపుడు ఈ బ్యూటిఫుల్ మూమెంట్ వైరల్ గా మారింది. ఇక ఈ వెకేషన్ తర్వాత అయితే తారక్ తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు