ఫోటో మూమెంట్ : ‘బాహుబలి’ లొకేషన్ ను కెమెరాలో బంధిస్తున్న ప్రభాస్.

prabhas
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రాన్ని అందమైన ప్రదేశాలలో, భారి సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రం కోసం రెండేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించిన ప్రభాస్.. ఆ మధుర స్మృతులను గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాహాబలేశ్వరంలో చిత్రీకరణ జరిగిన సమయంలో అక్కడి అందమైన లొకేషన్ ను ప్రభాస్ తన కెమెరాలో బంధిస్తుండగా ఆ మూమెంట్ ను మరో కెమెరా క్లిక్ మనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Exit mobile version