ఫోటో మూమెంట్ : బాలయ్యతో హ్యాపీ మూమెంట్ లో ప్రగ్యా

Published on Oct 6, 2021 1:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ” నిన్నటితో షూట్ అంతా కూడా కంప్లీట్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. మరి దాదాపు ఏడాది నుంచి కొనసాగుతున్న ఈ జర్నీ పై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఓకే బ్యూటిఫుల్ పోస్ట్ ను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బాలయ్యతో కలిసి ఒక ప్లెజెంట్ అండ్ స్టైలిష్ ఫోటో పెట్టి ఈ విధంగా తెలిపింది.

“ఫైనల్ గా ఏడాది జర్నీ కొన్ని లాక్ డౌన్స్ తర్వాత అఖండ సినిమా కంప్లీట్ అయ్యింది. మా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ఎప్పుడూ గ్రేట్ ఫుల్ గా ఉంటాను నా డ్రీం టీం తో వర్క్ చెయ్యడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా బాలకృష్ణ గారు ఎన్నో సమయాల్లో స్ట్రెస్ గా ఉన్నప్పుడు తన ఫాజిటివ్ నెస్ తో ఫన్ తో అంతా చక్కగా అయ్యేలా చూసుకున్నారు. ప్రతీరోజు ఏ టైం లో అయినా సరే మా టీం ఎంతో కస్టపడి చేసారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞ్యతగా ఉంటానని ప్రగ్యా తెలిపింది. చివరగా గా అఖండ గర్జనని త్వరలోనే థియేటర్స్ లో చూద్దామని ముగించింది.

సంబంధిత సమాచారం :