ఫోటో మూమెంట్ : 18 ఏళ్ల కితం చిరుని ఫస్ట్ టైం కలిసిన ఇప్పటి స్టార్ డైరెక్టర్.!

Published on Nov 6, 2021 11:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకోని ఎంతో మంది నటులు దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మరి అలాంటి వారిలో స్టార్ దర్శకుడు కే ఎస్ రవీంద్ర బాబీ కూడా ఒకరు. దర్శకుడిగా మంచి ట్రాక్ ఏర్పర్చుకున్న బాబీ ఇప్పుడు తన కలల హీరోతోనే సినిమా చేసే చిరు 154వ సినిమాను తాను తెరకెక్కించనుండగా బాబీ ఇప్పుడు ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేసుకున్నాడు.

తాను 18 ఏళ్ల కితం చిరుని కలిసి ఇప్పుడు సినిమా చేస్తున్న సందర్భంగా అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. “మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం! తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.” అని బాబీ తెలియజేసాడు. ఇప్పటికే చిరుతో చెయ్యబోయే సినిమాపై మంచి హై ని ఇస్తున్నాడు ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More