ఫోటో మూమెంట్ : తమ కేశవకి “పుష్ప” టీం స్పెషల్ విషెష్.!

ఫోటో మూమెంట్ : తమ కేశవకి “పుష్ప” టీం స్పెషల్ విషెష్.!

Published on Jan 18, 2022 3:44 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప ది రైజ్” ఇప్పటికీ కూడా మంచి వసూళ్లతో నిలబడి దూసుకెళ్తుంది. అలాగే దీనితో పాటుగా ఓటిటి లో వచ్చి కూడా మరింత స్థాయిలో రెస్పాన్స్ అందుకొని దూసుకెళ్తుంది. టోటల్ పాన్ ఇండియన్ వైడ్ కూడా హవా కొనసాగిస్తున్న పుష్ప లో ప్రతి పాత్ర కూడా ఆడియెన్స్ కి గుర్తుండిపోయాయని చెప్పడంలో సందేహం లేదు.

ముఖ్యంగా సినిమాలో పుష్ప రాజ్ అల్లు అర్జున్ తో కలిసి సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే పాత్ర కేశవ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పాత్రలో కొత్త నటుడే అయినా జగదీష్ అద్భుతంగా చేసి మంచి రెస్పాన్స్ ను కూడా అందుకున్నాడు. మరి తమ కేశవ పుట్టినరోజు ఈరోజు కావడంతో టోటల్ పుష్ప చిత్ర యూనిట్ అతడికి స్పెషల్ బర్త్ డే విషెష్ ని తెలియజేసారు.

దీనితో అల్లు అర్జున్ జగదీష్ కి కేక్ ని తినిపిస్తూ రిలీజ్ చేసిన ఫోటో మరింత ప్లెజెంట్ గా అనిపిస్తుంది. తన కేశవకి పుష్ప రాజ్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంది. దీనితో ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు