లేటెస్ట్ క్లిక్ : 2023 క్రికెట్ వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందుకున్న సూపర్ స్టార్

Published on Sep 19, 2023 8:00 pm IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ మూవీతో కెరీర్ లో అత్యద్భుత విజయం సొంతం చేసుకున్నారు. ఇక అతి త్వరలో ఆయన నెక్స్ట్ మూవీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆ మూవీ యొక్క పనుల్లో బిజీగా ఉన్నారు రజనీకాంత్. అయితే మ్యాటర్ ఏమిటంటే, అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానున్న ఐసిసి 2023 క్రికెట్ వరల్డ్ కప్ కి సంబంధించి పలువురు ప్రత్యేక సెలెబ్రిటీలను సెలెక్ట్ చేసిన బిసిసిఐ, వారికి గోల్డెన్ టికెట్ లని అందచేస్తోంది.

అందులో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా గోల్డెన్ టికెట్ ని అందుకున్నారు. బిసిసిఐ సెక్రటరీ జై షా చేతులమీదుగా నేడు మధ్యాహ్నం రజినీకాంత్ అందుకున్న గోల్డెన్ టికెట్ తాలూకు పిక్ ని తమ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసారు బిసిసిఐ వారు. ఇక రజినీకాంత్ తో పాటు సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ గోల్డెన్ టికెట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా ఈ టికెట్ ద్వారా ఆయా సెలెబ్రిటీస్ విఐపి లగ్జరి సౌకర్యాలతో మ్యాచ్ లను వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం :