ఫోటో మూమెంట్ : “ఆచార్య” సెట్స్ లో ఫ్యామిలీ ఫోటోతో చరణ్ బ్యూటిఫుల్ పోస్ట్.!

Published on Feb 18, 2022 4:02 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో అయితే రెండు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలే ఉన్నాయి. మరి వీటిలో భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” ఒకటి కాగా మరోకటి “ఆచార్య” అని చెప్పాలి.

అయితే మెగా ఫ్యాన్స్ కి ఆచార్య సినిమా మాత్రం ఒకింత స్పెషల్ చిత్రం అని తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా అందులో చరణ్ కీలక పాత్రలో నటించాడు. మరి ఇప్పుడు ఈ సినిమా సెట్స్ నుంచే చరణ్ ఒక బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ చేసి ఒక పోస్ట్ ని పెట్టాడు.

ఇందులో తాను తన తల్లిదండ్రులు చిరు, సురేఖ వాణి లు ఉండగా తన మాతృమూర్తికి ఈ ఫోటో ద్వారా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు. “నా గురించి మీకన్నా ఇంకెవరికీ ఎక్కువ తెలీదు హ్యాపీ బర్త్ డే మా..” అంటూ ఈ బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టగా ఇది వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :