ఫోటో మూమెంట్ : రష్మికా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్.!

Published on Jun 7, 2022 8:00 pm IST

మన టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే మంచి ఫేమ్ తెచ్చుకొని భారీ ఆఫర్స్ చేసుకోవడం బాగా అరుదుగానే ఉంటుంది. అలా కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ గా మారిన యంగ్ హీరోయిన్ రష్మికా మందన్నా. అయితే రష్మికా స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర నేషనల్ క్రష్ గా కూడా నిలిచింది.

ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ మంచి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం స్టన్నింగ్ అవతార్ లోకి మారిన రష్మికా తన లుక్స్ తో ఒక్కసారిగా తన ఫాలోవర్స్ మరియు సోషల్ మీడియాలో హీట్ రేపింది.

దీనితో ఈమె ఈ లేటెస్ట్ ఫొటో షూట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే రష్మికా మళ్ళీ తన కెరీర్ బిగ్ హిట్ పుష్ప ది రైజ్ కి సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం సిద్ధం అవుతుంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ఓ ప్రతిష్టాత్మక సినిమా కూడా చేస్తుంది.

సంబంధిత సమాచారం :