ఫోటో మూమెంట్ : తమ వింగ్స్ తో “RRR” టీం.!

Published on Feb 25, 2023 4:17 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుకుంటుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా అందుకోని రీచ్ ని రివార్డులు అవార్డులు ఈ సినిమాకి సొంతం అయ్యాయి. మరి ఇంతలా మన దేశపు సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన చిత్ర యూనిట్ తాము చిందించిన ప్రతి స్వేదపు బొట్టుకి సిసలైన ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో 5 అవార్డ్స్ తో అదరగొట్టిన ఈ సినిమా యూనిట్ అక్కడ హాజరయ్యారు. మరి తమ అవార్డ్స్ తో అయితే చరణ్ రాజమౌళి సహా కీరవాణి లు అంతా తమ వింగ్స్(రెక్కలు) ఉన్న అవార్డు ప్రతిమలతో కనిపిస్తున్నారు. దీంతో ఈ బ్యూటిఫుల్ స్నాప్ ఇప్పుడు వైరల్ గా మారి బెస్ట్ ఫోటో మూమెంట్స్ లో ఒకటిగా మారింది. దీనితో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :