ఫోటో మూమెంట్: థలా బర్త్ డేలో బాలీవుడ్ కండల వీరుడు

ఫోటో మూమెంట్: థలా బర్త్ డేలో బాలీవుడ్ కండల వీరుడు

Published on Jul 7, 2024 7:02 AM IST

ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ తో “సికందర్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొనగా లేటెస్ట్ గా సల్మాన్ ఆయితే థలా బర్త్ డే వేడుకల్లో కనిపించడం వైరల్ గా మారింది.

ఇండియా క్రికెట్ లెజెండ్స్ లో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు కావడంతో సల్మాన్ ఖాన్ స్పెషల్ గా ధోని దగ్గరకి వెళ్ళి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే తమ ఇద్దరి బ్యూటిఫుల్ పిక్ ని కూడా సల్మాన్ షేర్ చేసి ధోని కి బర్త్ డే విషెస్ తెలిపారు. దీనితో ఈ మూమెంట్ అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. మరి సల్మాన్ నటిస్తున్న సికందర్ సినిమాని సల్మాన్ అలాగే తన స్నేహితుడు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు