ఫోటో మూమెంట్ : హ్యాట్రిక్ సాంగ్ షూట్ తర్వాత మెగాస్టార్ తో శేఖర్ మాస్టర్

Published on Nov 23, 2021 4:07 pm IST

మెగాస్టార్ చిరంజీవి డాన్సులు కోసం టాలీవుడ్ ఆడియెన్స్ కి కానీ ఇతర ఇండస్ట్రీ లలో పెద్దలకు కానీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న స్టెప్ అయినా కూడా తన గ్రేస్ తో ఎంతో ఈజ్ తెచ్చేస్తారు మెగాస్టార్. మరి అలాంటిది ఓ టాప్ కొరియోగ్రాఫర్ తో సాంగ్ చేస్తే అది ఇంకో ల్వేల్లో ఉంటుంది. మరి అలానే తన కం బ్యాక్ సినిమా “ఖైదీ నెంబర్ 150” కి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే మాస్ సాంగ్ చేసిన శేఖర్ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే దీని తర్వాత మెగాస్టార్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” లో కూడా ఓ మాసివ్ సాంగ్ ని శేఖర్ మాస్టర్ చేసాడు. మరి ఈ రెండు తర్వాత ఇంకో మాస్ హ్యాట్రిక్ సాంగ్ ని చేసినట్టుగా దాని తర్వాత ఓ ఫోటోని మెగాస్టార్ తో కలిపి ఉన్నది షేర్ చేసుకున్నారు. మరి ఈ సాంగ్ మెహర్ రమేష్ తో చేస్తున్న మాస్ చిత్రం “భోళా శంకర్” కి చేశారట. ఇక ఈ హ్యాట్రిక్ సాంగ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More