ఫోటో మూమెంట్ : న్యూయార్క్ నగర వీధుల్లో స్టైలిష్ మహేష్, నమ్రత జంట.!

ఫోటో మూమెంట్ : న్యూయార్క్ నగర వీధుల్లో స్టైలిష్ మహేష్, నమ్రత జంట.!

Published on Jul 6, 2022 2:00 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “సర్కారు వారి పాట” అనంతరం తన కుటుంబంతో కలిసి ఒక హ్యాపీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం తమ ఫెవరెట్ ప్లేసుల్లో కనిపిస్తూ తమ హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా అయితే నమ్రత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశారు.

మహేష్ మరియు తాను కలిసి న్యూయార్క్ నగర వీధుల్లో కలిసి ఒక స్టైలిష్ పోజ్ ఇచ్చారు. మరి ఇందులో మహేష్ మాత్రం సూపర్ స్టైలిష్ గా ఉన్నాడని చెప్పాలి. సర్కారు వారి పాట హెయిర్ స్టైల్ లోనే ఇన్ని రోజులు కనిపించిన మహేష్ ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా దానిని మార్చేశారు. మొత్తానికి అయితే ఈ లుక్ తో వీరి జంట మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇక ఈ వెకేషన్ తర్వాత మహేష్ అయితే త్రివిక్రమ్ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు.

https://www.instagram.com/p/CfqajGAjcKJ/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు