ఫోటో మూమెంట్ : సూర్య, జ్యోతిక ల బ్యూటిఫుల్ వెకేషన్ క్లిక్.!

Published on Jun 23, 2022 1:13 pm IST

రీసెంట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రం “విక్రమ్” లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన క్యామియో రోల్ కి అటు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాము. మరి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అనంతరం సూర్య తన భార్య జ్యోతిక తో కలిసి చాలా కాలం తర్వాత వెకేషన్ ట్రిప్ కి వెళ్లడం జరిగింది.

అయితే ఈ వెకేషన్ నుంచి ఇద్దరు ఎంతో హ్యాపీగా గడుపుతున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ బ్రిడ్జి దగ్గర సూర్య మరియు జ్యోతికల సెల్ఫీ అభిమానులకి మరింత ఆనందం కలిగిస్తుంది. ఇక ఇదిలా ఉండగా సూర్య ప్రస్తుతం వెట్రిమారన్ తో వాడి వాసల్ సినిమా చేస్తుండగా జ్యోతిక కూడా పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఈ వెకేషన్ తర్వాత జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం :